అడిలైడ్: ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో వన్డేలో టీం ఇండియా ఓపెనర్ రోహిత్ శర్మ గట్టిగా కమ్‌బ్యాక్ ఇచ్చాడు. తొలి వన్డేలో స్వల్పస్కోర్‌కే పరిమితమైన రోహిత్.. రెండో వన్డేలో చెలరేగిపోయాడు. తొలుత నెమ్మదిగా ఆడిన రోహిత్.. ఆ తర్వాత క్రీజ్‌లో నిలదొక్కుకొన ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడ్డాడు. 97 బంతులు ఎదురుకున్న రోహిత్ 7 ఫోర్లు, 2 సిక్సుల సాయంతో 73 పరుగులు చేశాడు. కచ్చితంగా సెంచరీ సాధిస్తాడని భావించిన సమయంలో భారీ షాకట్‌కు ప్రయత్నించి ఔట్ అయ్యాడు.
ఈ క్రమంలో రోహిత్ పలు రికార్డులను బద్దలుకొట్టాడు. వన్డేల్లో భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన రెండో ఓపెనర్‌ా రోహిత్ రికార్డ్ సాధించాడు. ఓపెనర్‌గా అతడు 9180* పరుగులు చేశాడు. ఈ క్రమంలో గంగూలీ(9146)ని రోహిత్ దాటేశాడు. ఇక వన్డేల్లో ఆస్ట్రేలియా గడ్డపై ఆసీస్‌పై 1,000 కంటే ఎక్కువ పరుగులు చేసి తొలి భారత బ్యాటర్‌గా, ఓవరాల్‌గా ఐదో క్రికెటర్‌గా రోహిత్ నిలిచాడు. దీంతో పాటు.. వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాళ్ల జాబితాలో రోహిత్ మూడో స్థానానికి చేరుకున్నాడు. ఈ క్రమంలో గంగూలీ(11,221)ను రోహిత్(11,225) అధిగమించాడు. అంతేకాక.. ఆస్ట్రేలియాపై వన్డేల్లో అత్యధిక హాఫ్ సెంచరీలు చేసిన నాలుగో ఆటగాడిగా బ్రియాన్ లారా రికార్డును రోహిత్ సమం చేశాడు. వీరిద్దరు ఆసీస్‌ప 18 హాఫ్ సెంచరీలు చేశారు.