హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి, సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో సినిమా చేస్తున్న విషయం తెలిసందే. ‘మన శంకరవరప్రసాద్ గారు’ అనేది ఈ సినిమా టైటిల్. నయనతార ఇందులో హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి ‘మీసాల పిల్ల’ అంటూ సాగే పాటని విడుదల చేశారు. ఈ పాటకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమా నుంచి తాజాగా మరో సర్‌ప్రైజ్‌ని ఇచ్చింది చిత్ర యూనిట్.
ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ ప్రత్యేక పాత్రలో నటిస్తున్నారని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. ఆ విషయాన్ని చిత్ర యూనిట్ తాజాగా ధృవీకరించింది. ఈ సినిమాలోకి వెంకటేష్‌ను ఆహ్వానిస్తూ.. చిరంజీవి ఎక్స్‌లో పోస్ట్ చేశారు. అయితే వెంకటేష్ ఏ పాత్రలో కనిపిస్తారనే విషయాన్ని వెల్లడించలేదు. తొలిసారిగా వెంకటేష్, చిరంజీవిలు కలిసి నటిస్తున్న సినిమా ఇదే కావడం మరో విశేషం. ఈ తాజా అప్‌డేట్‌తో ఇద్దరు హీరోల ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. మరి ఈ కాంబినేషన్ వెండితెరపై ఎలా అలరిస్తుందో తెలియాలంటే.. వచ్చే సంక్రాంతి వరకూ ఎదురుచూడాల్సిందే.