రిషబ్ శెట్టి హీరోగా, స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కాంతార : ఛాప్టర్ 1’. 2022లో వచ్చిన ‘కాంతార’ సినిమాకు ఇది ప్రీక్వెల్. 16వ శతాబ్ధం బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమాను తెరకెక్కించారు. అక్టోబర్ 2వ తేదీన విడుదలైన ఈ సినిమా బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. కలెక్షన్ల పరంగా కాసుల పంట పండించింది. అయితే ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ సన్నివేశాలు ఇంత అద్భుతంగా రావడం కోసం హీరో రిషబ్ శెట్టి పడిన కష్టం అంతాఇంతా కాదు. అందుకు సంబంధించిన వీడియోని (మేకింగ్ వీడియో)ని తాజాగా విడుదల చేశారు. ఈ వీడియోలో రిషబ్ ఫైటింగ్, జిమ్, గుర్రపు స్వారీ చేయడం మనం చూడొచ్చు. సినిమాలో స్టంట్ డబుల్స్, షార్ట్ కట్స్, ఏవీ లేవని, స్వచ్ఛమైన దైవ భక్తితో చేశామని వీడియోలో పేర్కొన్నారు. ఈ వీడియో చూస్తే సినిమా కోసం రిషబ్ ఎంత కష్టపడ్డాడో తెలుస్తోంది. మీరు కూడా రిషబ్ ఎంత కష్టపడ్డాడో ఓ లుక్కేయండి..