అడిలైడ్: మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా అడిలైడ్ ఓవల్‌లో భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న రెండో వన్డే టెన్షన్.. టెన్షన్‌గా సాగుతోంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇండియా 50 ఓవర్లలో 9 వికెట్ల కోల్పోయి 264 పరుగులు చేసింది. 265 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా బ్యాటర్లు నిలకడగా బ్యాటింగ్ చేస్తున్నారు. 30 పరుగుల జట్టు స్కోర్ వద్ద మిచెల్ మార్ష్ (11)ను అర్ష్‌దీప్ సింగ్ ఔట్ చేశాడు. ఆ తర్వాత కీలక ఆటగాడు ట్రావిస్ హెడ్(28)ని హర్షిత్ రాణా పెవిలియన్ చేర్చాడు.
ఈ దశలో మ్యాథ్యూ షార్ట్.. అద్భుతంగా భారత బౌలర్లను ఎదురుకున్నాడు. 78 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సుల సాయంతో 74 పరుగులు చేశాడు. దీంతో ఆస్ట్రేలియా స్కోర్ పుంజుకుంది. అయితే షార్ట్‌ను హర్షిత్ ఔట్ చేశాడు. ఆ తర్వాత రెన్షా (30)ను అక్షర్, క్యారే (9) సుందర్ ఔట్ చేశారు. ప్రస్తుతం 38 ఓవర్లు ముగిసేసరికి ఆస్ట్రేలియా 39 ఓవర్లు ముగిసేసరికి 5 వికెట్ల నష్టానికి 207 పరుగులు చేసింది. క్రీజ్‌లో కన్నోల్లి (34), ఓవెన్ (17) ఉన్నారు. ఈ మ్యాచ్‌లో విజయం సాధించాలంటే ఆస్ట్రేలియా 66 బంతుల్లో 56 పరుగులు చేయాలి.