అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కృష్ణా జిల్లా ఉయ్యూరు ప్రాంతంలోని ఓ గ్రామంలో దారుణం వెలుగులోకి వచ్చింది. మైనర్ బాలికపై వరుసకు మేనమామ అయ్యే వ్యక్తి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. మైనర్ బాలికపై మేనమామ పలుసార్లు అత్యాచారం చేశాడు. బాలిక కేకలు వేయడంతో మేనమామను స్థానికులు పట్టుకున్నారు. కామాంధుడికి పోలీసులు దేహశుద్ధి చేసి అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసి అతడిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. బాలికను ఆరోగ్య పరీక్షల నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు.