హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి హీరోగా, సెన్సేషనల్ దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం ‘మన శంకరవరప్రసాద్ గారు’. ఫ్యామిలీ అండ్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు అనిల్. ఈ సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సినిమాలో నయనతార శశిరేఖ అనే పాత్రలో హీరోయిన్‌గా నటస్తున్నారు.
దసరా సందర్భంగా ఈ సినిమా నుంచి ‘మీసాల పిల్ల’ అంటూ సాగే పాట ప్రోమోని విడుదల చేశారు. కొద్ది రోజుల క్రితం పూర్తి పాటని వదిలారు. ఈ పాట ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. అయితే ఇప్పుడు ఇంటర్నెట్‌లో రికార్టులను సృష్టిస్తోంది. ప్రస్తుతం ఈ పాటకు 30 మిలియన్ల వ్యూస్, 30 వేల రీల్స్, 300 మిలియన్ల రీల్స్ వ్యూస్‌తో దూసుకుపోతోంది. అంతేకాకుండా అన్ని మ్యూజిక్ ఫ్లాట్‌పామ్స్‌లో 50 మిలియన్లకు పైగా ఈ పాటను ప్లే చేశారు. ఈ పాటను ఉదిత్ నారాయణ, శ్వేతా మోహన్ అలపించారు. బీమ్స్ సంగీతం అందించిన ఈ పాటకు భాస్కరభట్ల రవికుమార్ సాహిత్యం అందించారు.