సూపర్ హీరో తేజ సజ్జా బ్రహ్మండ్ బ్లాక్ బస్టర్ ‘మిరాయ్’. ఈ చిత్రానికి కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించారు. రాకింగ్ స్టార్ మనోజ్ మంచు పవర్ ఫుల్ పాత్ర పోషించారు. రితికా నాయక్ హీరోయిన్ గా నటించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టిజి విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ భారీ స్థాయిలో నిర్మించారు. సెప్టెంబర్ 12న వరల్డ్ వైడ్ గ్రాండ్‌గా రిలీజైన ఈ చిత్రం బ్రహ్మండ్ బ్లాక్ బస్టర్ సక్సెస్ ని అందుకుని అద్భుతమైన కలెక్షన్స్ తో రికార్డ్ సృష్టించింది. ఈ సందర్భంగా మేకర్స్ బ్రహ్మాండ్ బ్లాక్ బస్టర్ సక్సెస్ సెలబ్రేషన్ మీట్ నిర్వహించారు. ఈ వేడుకలో యూనిట్ అందరికీ మెమెంటోలు అందించి అభినందించారు.
ఈ వేడుకలో హీరో తేజ సజ్జ మాట్లాడుతూ.. “సినిమా రిలీజ్ అయి దాదాపుగా 45 రోజులు అవుతోంది. ఓటీటీలోకి వచ్చిన వరకూ కూడా థియేటర్లలో ఈ సినిమా నడుస్త్తోంది. ఇంత బ్రహ్మాండ్ బ్లాక్ బాస్టర్ లాంటి సినిమా ఇచ్చిన డాక్టర్ కార్తీక్‌కి థాంక్యూ” అని అన్నారు. నిర్మాత టీజీ విశ్వప్రసాద్ మాట్లాడుతూ.. “ఈ సినిమాను పాన్ వరల్డ్ ఫ్రాంచైజ్ చేస్తున్నాం. ఓటీటీలో ఇండియాలోనే ఎక్కువ మంది చూసిన సినిమాగా ఇది నిలుస్తుందని ఆశిస్తున్నాం” అని తెలిపారు.
డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని మాట్లాడుతూ.. “సినిమాని నేను ఎప్పుడు కూడా మ్యాజిక్ అనుకునేవాడిని. తీయడం మొదలుపెట్టాక మ్యాజిక్ అనేది నెమ్మదిగా అర్థమైంది. అందరి సహకారంతో సినిమా తయారవుతుంది. మా టీమ్ అందరికీ ధన్యవాదాలు”అని తెలియజేశారు. ఈ వేడుకలో రితిక నాయక్, గౌరా హరి, వై.రవిశంకర్, మారుతి, వెంకటేష్ మహా, సంపత్ నంది, శ్రీరామ్ ఆదిత్య, శశిధర్ రెడ్డి పాల్గొన్నారు.