చెన్నై: తమిళనాడులోని భారీ వర్షాలకు ఇల్లుకూలి ఇద్దరు మహిళలు మృతి చెందారు. కడలూరు జిల్లాలో ఈ సంఘటన జరిగింది. బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో వర్షాలు కురుస్తున్నాయి. ఈ కం తమిళనాడులోని చెంగల్‌పట్టు, విల్లుపురం, కడలూరు, మైలాడుతురై జిల్లాలకు ఐఎండీ రెడ్ అలర్ట్ జారీ చేశారు. తమిళనాడు ప్రభుత్వం, రెడ్ అలర్ట్ జారీ అయిన జిల్లాలకు 12 మంది సీనియర్ ఐఎఎస్ అధికారులను పర్యవేక్షకులుగా నియమించి సహాయ చర్యలను ముమ్మరం చేసింది.