రెబల్‌స్టార్ ప్రభాస్, హను రాఘవపూడి దర్శకత్వంలో సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. ప్రభాస్‌కు జంట ఇమాన్వీ నటిస్తోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన అప్‌డేట్‌ని విడుదల చేశారు.
గురువారం ఉదయం సినిమా టైటిల్‌ని ప్రకటిస్తామని చిత్ర యూనిట్ తెలిపింది. ఈ మేరకు ఓ పోస్టర్‌ని విడుదల చేశారు. ‘పాండవుల పక్షాన కర్ణుడు’ అంటూ ఆ పోస్టర్‌కి క్యాప్షన్ పెట్టారు. అంతేకాక ‘1932 నుంచి ఇతడి కోసం అందరూ వెతుకుతున్నారు’.. ఒంటరిగా పోరాడిన బెటాలియన్’ అనే ట్యాగ్‌లైన్‌ను జత చేశారు. పోస్టర్ సినిమాపై అంచనాలను పెంచేసింది.
ఇక ఈ సినిమాకు ‘ఫౌజీ’ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. విభిన్నమైన కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇందులో ప్రభాస్ సైనికుడి పాత్రలో కనిపిస్తాడని టాక్. 1930వ దశకంలో జరిగే కథగా.. మాతృభూమి ప్రజలకు న్యాయం అందించడానికి ఓ యోధుడు చేసే పోరాటాన్ని ఈ సినిమాలో చూపించనున్నారు. వాస్తవ సంఘటనలకు కొంత ఫిక్షన్ జోడించి ఈ కథను సిద్ధం చేశారు దర్శకుడు హను.