వరుస ఓటములతో సెమీస్ ఛాన్స్ సంక్లిష్టం!
మన తెలంగాణ/క్రీడా విభాగం: సొంత గడ్డ పై జరుగుతున్న వన్డే ప్రపంచకప్‌లో భారత మహిళా క్రికెట్ టీమ్ మెరుగైన ప్రదర్శనతో అ లరిస్తుందని భావించిన కోట్లాది మంది అభిమానులకు నిరాశే మిగిలింది. ఈ వరల్డ్‌కప్ హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలోని భారత జట్టు వరుస ఓటములతో సతమతమవుతోంది. హ్యా ట్రిక్ ఓటములతో సెమీ ఫైనల్ అవకాశాలను సంక్లిష్టంగా మార్చుకుంది. సెమీస్ రేసులో ని లువాలంటే ఇకపై ఆడే రెండు మ్యాచుల్లోనూ కచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి జట్టుకు నెలకొంది. చివరి మూడు మ్యాచుల్లో టీమిండి యా చేజేతులా ఓడిందని చెప్పడంలో ఎలాం టి అతిశయోక్తి లేదు. సౌతాఫ్రికా, ఆస్ట్రేలి యా, ఇంగ్లండ్ జట్లతో జరిగిన మ్యాచుల్లో గె లిచే స్థితిలో ఉండి కూడా పరాజయం పా లైంది. ఈ మ్యాచుల్లో కాస్త సంయమనంతో ఆడి ఉంటే కచ్చితంగా విజయం దక్కేది. కానీ కీలక సమయంలో ఒత్తిడి గురై పరాజయాలను మూట గట్టుకుంది. ఇంగ్లండ్‌తో జరిగిన కిందటి మ్యాచ్‌లో ఒక దశలో భారత్ అలవోకగా గెలుస్తుందని అందరూ భావించారు.
ఇంగ్లండ్ క్రికెటర్లు కూడా దాదాపు చేతులెత్తేసినట్టే కనిపించారు. అయితే కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ కీలక సమయంలో పెవిలియన్ చేరి జ ట్టును కష్టాల్లోకి నెట్టింది. హర్మన్, మంధాన బ్యాటింగ్‌ను చూస్తే టీమిండియా గెలుపు లాంఛనమే అనిపించింది. కానీ వీరిద్దరూ కొద్దిసేపు వ్యవధిలో ఔట్ కావడంతో భారత్‌కు అనూహ్య ఓటమి తప్పలేదు. సౌతాఫ్రికా, ఆ స్ట్రేలియా మ్యాచుల్లోనూ టీమిండియాకు ఇ లాంటి చేదు అనుభవమే ఎదురైంది. ఈ మ్యా చుల్లో కూడా గెలిచే స్థితిలో ఉండి కూడా పరాజయం చవిచూసింది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో టీమిండియా తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేక పోతోంది. కీలక సమయంలో బ్యాటర్లు, బౌలర్లు విఫలమవుతున్నారు.
వికెట్లు తీయడంలో, పరుగులు సాధించడంలో టీమిండియా క్రికెటర్లు పూర్తిగా నిరాశ పరుస్తున్నారు. దీనికి తోడు పేలవమైన ఫీల్డింగ్ కూడా జట్టు వరుస ఓటములకు ఒక కారణంగా చెప్పాలి. సొంత గడ్డపై జరుగుతున్న వరల్డ్‌కప్‌లో టీమిండియా ఈసారి ట్రోఫీ సాధించే అవకాశాలు మెరుగ్గా ఉన్నాయని విశ్లేషకులు జోస్యం చెప్పారు. కానీ భారత జట్టు పేలవమైన ప్రదర్శనతో కనీసం సెమీస్ బెర్త్‌ను దక్కించుకోవడం కూడా క్లిష్టంగా మార్చుకుంది. న్యూజిలాండ్, బంగ్లాదేశ్ జట్లతో జరిగే చివరి రెండు మ్యాచుల్లో భారీ తేడాతో విజయం సాధించడమే కాకుండా ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సిన పరిస్థితి టీమిండియాకు ఏర్పడింది. ఇలాంటి స్థితిలో మిగిలిన మ్యాచులు భారత్‌కు చావోరేవోగా మారాయి. తీవ్ర ఒత్తిడి నెలకొన్న నేపథ్యంలో పటిష్టమైన న్యూజిలాండ్‌తో పోరు భారత్‌కు అతి పెద్ద సవాల్‌గా తయారైంది. గురువారం జరిగే ఈ మ్యాచ్‌లో గెలిస్తేనే హర్మన్ సేన సెమీస్ అవకాశాలు సజీవంగా ఉంటాయి. లేకుంటే నాకౌట్‌కు అర్హత సాధించడం చాలా కష్టమనే చెప్పాలి.