ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఇళయరాజా ఈ మధ్యకాలంలో వివాదాలతోనే వార్తల్లో నిలుస్తున్నారు. పలు చిత్రాల్లో ఆయన అనుమతి లేకుండా తన పాటలు వాడుకున్నారని.. ఆయన ఆరోపించడం సర్వసాధారణమైంది. తాజాగా విడుదలై ‘డ్యూడ్’ చిత్రంలో కూడా ఆయన స్వరపరచిన రెండు పాటలు అనుమతి లేకుండా చిత్ర బృందం వినియోగించిందని ఇళయరాజా ఆరోపించారు. ఈ మేరకు ఆ చిత్ర యూనిట్, ఆడియో కంపెనీ సోనీ మ్యూజిక్‌పై చట్టపరమైన చర్యలకు ఆయన సిద్ధమయ్యారు. ఈ మేరకు ఆయన మద్రాసు హై కోర్టును ఆశ్రయించగా.. న్యాయపరంగా ముందుకు వెళ్లేందుకు ఇళయరాజాకు కోర్టు అనుమతి ఇచ్చింది. మరి దీనిపై తదుపరి పరిణామాలు ఎలా ఉంటాయో వేచి చూడాల్సిందే.
ఇక డ్యూడ్ చిత్రం విషయానికొస్తే.. లవ్ టుడే, రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన ప్రదీప్ రంగనాథన్ ఈ చిత్రంలో హీరో. ప్రేమలు ఫేమ్ మమిత బైజు ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించింది. దీపావళి కానుకగా ఈ సినిమా అక్టోబర్ 17న విడుదలై ఫర్వాలేదనిపించింది.