ఉగాండా రాజధాని కంపాలలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గులు రోడ్డుపై పలు వాహనాలు ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 63 మంది మృత్యువాత పడ్డారు. మంగళవారం అర్ధరాత్రి ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. గులు హైవేపై ఓ బస్సు డ్రైవర్ లారీని ఓవర్ టేక్ చేస్తూ.. ఎదురుగా వస్తున్న మరో బస్సును ఢీకొంది. వెంటనే డ్రైవర్ బస్సును మరో వైపునకు తిప్పడంతో పక్కన.. ఎదురుగా వస్తున్న రెండు కార్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి. దీంతో నియంత్రణ కోల్పోయి పలు వాహనాలు వరుసగా ఢీకొని బోల్తా పడ్డాయి. ప్రమాదంలో మరణించిన మృతదేహాలను పోస్ట్‌మార్టంకు, గాయపడినవారిని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.