హైదరరాబాద్: నగరంలో దీపావళి సందర్భంగా బాణాసంచా కాల్చే సమయంలో అజాగ్రత్తగా వ్యవహరించడంతో పలువురు గాయాలపాలయ్యారు. మెహదీపట్నంలోని సరోజినీ దేవి కంటి ఆసుపత్రికి గాయపడిన వారు చికిత్స కోసం వచ్చారు. ఆస్పత్రిలో 18 మంది చిన్నారులతో సహా 47 మందికి చికిత్స అందిస్తున్నారు. ఇద్దరు యువకుల పరిస్థితి విషమంగా ఉందని సరోజిని దేవి ఆస్పత్రి వైద్యులు తెలిపారు.దీపావళి టపాసులు చేతిలో పేలడం, కళ్లలో ముక్కలు పడడం వంటి ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. ప్రతి సంవత్సరం దీపావళి రోజున ఇలాంటి ఘటనలు పునరావృతమవుతున్నాయి. ప్రజలు బాణసంచా కాల్చేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని వైద్యులు, అధికారులు హెచ్చరిస్తున్నారు.