బంగ్లాదేశ్‌తో మంగళవారం జరిగిన రెండో వన్డేలో వెస్టిండీస్ సూపర్ ఓవర్‌లో విజయం సాధించింది. ఈ గెలుపుతో విండీస్ సిరీస్‌ను 11తో సమం చేసింది. తొలి వన్డేలో ఆతిథ్య బంగ్లాదేశ్ జయకేతనం ఎగుర వేసింది. రెండో వన్డేలో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 213 పరుగులు చేసింది. తర్వాత లక్షఛేదనకు దిగిన విండీస్ కూడా నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లకు 213 పరుగులు చేయడంతో మ్యాచ్ టై అయ్యింది. దీంతో సూపర్ ఓవర్ ద్వారా ఫలితాన్ని తేల్చారు. సూపర్ ఓవర్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ వికెట్ నష్టానికి 10 పరుగులు సాధించింది. అనంతరం బ్యాటింగ్ చేపట్టిన విండీస్ ఒక వికెట్ కోల్పోయి 9 పరుగులు మాత్రమే చేసి ఓటమి పాలైంది. అకీల్ హుస్సేన్ అద్భుత బౌలింగ్‌తో విండీస్‌ను గెలిపించాడు. ఇక నిర్ణీత ఓవర్లలో ముందుగా బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్‌ను సౌమ్య సర్కార్ (45), రిశాద్ 39 (నాటౌట్), కెప్టెన్ మెహదీ హసన్ 32 (నాటౌట్) ఆదుకున్నారు. విండీస్ టీమ్‌లో కెప్టెన్ షాయ్ హోప్ 53 (నాటౌట్), కార్టీ (35) పరుగులు చేశారు.