అడిలైడ్: ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా టీం ఇండియా ఆసీస్‌తో మూడు వన్డేలు, ఐదు టి-20ల్లో తలపడనుంది. ఇందులో భాగంగా పెర్త్ వేదికగా జరిగిన తొలి వన్డేలో ఆస్ట్రేలియా విజయం సాధించింది. దీంతో 1-0 తేడాతో భారత్ వెనకంజలో ఉంది. ఈ క్రమంలో రెండు వన్డే కచ్చితంగా గెలిచి తీరాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పటికే అడిడైల్ చేరుకున్న భారత్.. అక్కడ ముమ్మరంగా సాధన ప్రారంభించింది.
ఏడు నెలల విరామం తర్వాత మైదానంలోకి అడుగుపెట్టిన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు తీవ్రస్థాయిలో నిరాశపరిచారు. రోహిత్ 8 పరుగులు చేయగా, కోహ్లీ డకౌట్ అయ్యాడు. దీంతో రెండో వన్డే ఈ ఇద్దరికి కూడ కఠిన పరీక్ష కానుంది. దీంతో రెండె వన్డేలో భారత్ తిరిగి పు్ంజుకొని.. మంచి విజయం సాధించాలని అభిమానులు కోరుకుంటున్నారు.