అడిలైడ్: భారత్ ఆస్ట్రేలియా మధ్య పెర్త్ వేదికగా జరిగిన తొలి వన్డేకి వర్షం ఆటంకం కలిగించింది. వర్షం కారణంగా మ్యాచ్ దాదాపు నాలుగు సార్లు వాయిదా పడింది. ఫలితంగా మ్యాచ్‌ని 26 ఓవర్లకు కుదించారు. దీంతో అభిమానులు నిరాశ చెందారు. అంతేకాక.. పిచ్‌పై తేమ శాతం ఎక్కువగా ఉండటంతో అది బౌలింగ్‌కి అనుకూలించి భారత్ వరుసగా వికెట్లు కోల్పోయింది. చివరకు ఆస్ట్రేలియా ఈ మ్యాచ్‌లో విజయం సాధించింది.
అయితే అడిలైడ్ వేదికగా భారత, ఆసీస్ మధ్య రెండో వన్డే గురువారం జరుగుతుంది. ప్రస్తుతం అక్కడ కూడా వర్షాలు పడుతున్నాయి. వర్షాలతో పిచ్‌పై తేమ శాతం పెరగకుండా యువి లైట్లను ఉంచుతున్నారు. పిచ్ కండిషన్ మెరుగుపర్చడానికి ఈ పద్ధతిని అనుసరిస్తున్నారు. యువి లైట్ల నుంచి వచ్చే వెలుతురు వేడితో కూడుకుని ఉంటుంది. దీంతో పిచ్‌పై తేమ శాతం తగ్గడమే కాక.. పిచ్ కాస్త పొడిగా ఉంటుంది. మరోవైపు మ్యాచ్ జరిగే రోజు వర్షం కురిసే అవకాశం లేదని అక్యూవెదర్ నివేదిక చెబుతోంది.