మనతెలంగాణ/హైదరాబాద్ : జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉప ఎన్నికల ప్రచారం కోసం బిఆర్‌ఎస్ పార్టీ 40 మందితో కూడిన స్టార్ క్యాంపెయినర్ల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాకు రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి(సిఇఒ) ఆమోదం తెలిపారు. స్టార్ క్యాంపెయినర్ల జాబితతాలో బిఆర్‌ఎస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్, పార్టీ ఆగ్రనేత హరీష్ రావు తదితరులు ఈ జాబితాలో ఉన్నారు. వీరితో పాటు మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డి, పద్మారావు గౌడ్, మహమూద్ అలీ,వేముల ప్రశాంత్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు,శ్రీనివాస్ గౌడ్,నిరంజన్ రెడ్డి, జగదీశ్ రెడ్డి, గంగుల కమలాకర్, ఎంఎల్‌సి దాసోజు శ్రవణ్, ఎంపి వద్దిరాజు రవిచంద్ర, ఎంఎల్‌ఎలు వివేకానంద్ గౌడ్,
సుధీర్ రెడ్డి,ముఠా గోపాల్, పల్లా రాజేశ్వర్ రెడ్డి, కాలేరు వెంకటేశం, పాడి కౌశిక్ రెడ్డి, ఎం. కృష్ణారావు తదితరులు బిఆర్‌ఎస్ స్టార్ క్యాంపెయినర్ జాబితాలో ఉన్నారు. బిఆర్‌ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సోమ భరత్ కుమార్ చేసిన ప్రతిపాదన మేరకు 40 మంది స్టార్ క్యాంపెనర్లకు వాహన అనుమతి పాస్‌లను మంజూరు చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను బిఆర్‌ఎస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. ఈ ఎన్నికలో గెలుపే లక్షంగా పార్టీ అగ్రనేతలు వ్యూహాత్మకంగా కార్యక్రమాలు చేపడుతున్నారు. కార్యకర్తల్లో మరింత మరింత ఊపు తీసుకువచ్చి, ఓటర్లను ఆకర్షించేందుకు పార్టీ అధినేత కెసిఆర్ జూబ్లీహిల్స్‌లో ప్రచారం నిర్వహించే అవకాశం కనిపిస్తోంది. ఈ నెలాఖరులో లేదా నవంబర్ మొదటి వారంలో కెసిఆర్ ప్రచారం నిర్వహించనున్నట్లు తెలిసింది. సభ లేదా రోడ్ షోలో కెసిఆర్ పాల్గొనే అవకాశం ఉన్నట్లు సమాచారం.