జూబ్లీహిల్స్ నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్‌ను గెలిపించాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో భాగంగా బోరబండలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ తరఫున మంగళవారం మంత్రి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. గత ప్రభుత్వం జూబ్లీహిల్స్ నియోజకవర్గాన్ని విస్మరించిందని, సమస్యలతో నిండిపోయిందని తెలిపారు. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌కు ఒక అవకాశం ఇవ్వాలని ఓటర్లను అభ్యర్థించారు. ఆయనకు అవకాశం ఇస్తే నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి చూపిస్తారని తెలిపారు.