హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం పీరం చెరువులో విషాదం చోటుచేసుకుంది. చెరువులో బట్టలు ఉతకడానికి వెళ్లి ప్రమాదవశాత్తు వృద్ధురాలు, ఆమె మనవరాలు చెరువులో పడి మృతి చెందారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతులు తాండూర్ కు చెందిన యూసుఫ్(60), సబియా(10) గా పోలీసులు గుర్తించారు. ఇద్దరి మృతదేహాలను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.