తేజా సజ్జా, మంచు మనోజ్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘మిరాయ్’. ఈ సెప్టెంబర్ 5న విడుదలైన ఈ సినిమా మంచి ప్రేక్షకాదరణ సొంతం చేసుకుంది. కలెక్షన్ల పరంగా కాసుల పంట పండించింది. ప్రస్తుతం ఈ సినిమా ప్రముఖ ఒటిటి సంస్థ జియో హట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. బాక్సీఫీస్ వద్ద గ్రాండ్ సక్సెస్ అందుకు మిరాయ్ ఇప్పుడు ఒటిటిలో కూడా రికార్డులు సృష్టిస్తోంది. ఇప్పటివరకూ 200+ మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ పూర్తి చేసుకున్నట్లు జియో హాట్‌స్టార్ వెల్లడించింది.
అంతేకాక.. ఈ దీపావళి వీకెండ్‌లో అత్యధిక మంది వీక్షించిన చిత్రంగానూ ఈ సినిమా నిలిచింది. ముఖ్యంగా ఇండియా, మలేషియా, ఇండోనేషియా, థాయ్‌లాండ్ దేశాలలో ఈ సినిమాను అత్యధిక మంది వీక్షించారు. కాగా, రూ.60 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా రూ.150 కోట్ల వసూళ్లు రాబట్టింది. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించని ఈ సినిమాలో రితిక నాయక్ హీరోయిన్‌గా నటించింది.