హైదరాబాద్: ‘మకుటం’ సినిమాలో విశాల్ హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీపై అభిమానులకు కొత్త అప్‌డేట్ ఇచ్చాడు. ఈ చిత్రానికి తానే దర్శకత్వం వహిస్తున్నానని వివరించాడు. మకుటం సినిమాకు రవి అరసు దర్శకత్వం వహించగా సూపర్ గుడ్ ఫిల్మ్ నిర్మాతగా వ్యవహిరిస్తోంది. విశాల్ కు 35వ మూవీకాగా నిర్మాణ సంస్థకు మాత్రం 9వ మూవీ. రవితో విశాల్‌కు విభేదాలు రావడంతో తానే దర్శకత్వం వహిస్తున్నానని తన సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేయడంతో వైరల్‌గా మారింది. అందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. మకుటం సినిమా సెకండ్ లుక్‌ను ప్రేక్షకులతో పంచుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఈ సినిమాకు తాను దర్శకత్వం వహిస్తానని కలలో కూడా అనుకోలేదని, అనివార్య కారణాలతో తాను బాధ్యత తీసుకోవాల్సి వచ్చిందని పేర్కొన్నారు. మూవీ అంటే కమిట్‌మెంట్ ఉండడంతో పాటు ప్రేక్షకులు, నిర్మాతల నమ్మకాన్ని వమ్ముచేయకుండా నిలబెట్టుకోవడం అని తెలిపారు. మళీ సినిమాపై రీ వర్క్ చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకోస్తున్నానని, ఇది తన కొత్త ప్రయాణం అని విశాల్ స్పష్టం చేశారు.