అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అల్లూరి జిల్లాలో దారుణం వెలుగులోకి వచ్చింది. కొయ్యూరు జడ్‌పిటిసి వారా నూకరాజు దారుణ హత్యకు గురయ్యారు. రోలుగుంట మండలం పెదపేట వద్ద సోమవారం ఉదయం జడ్‌పిటిసి నూకరాజును గుర్తు తెలియని వ్యక్తులు చంపేశారు. గత జడ్‌పిటిసి ఎన్నికలలో వైఎస్‌ఆర్‌సిపి తరపున గెలుపొందారు. గతంలో కూడా నూకరాజుపై అతడి వ్యతిరేక వర్గీయులు దాడి చేశారు. నూకరాజు హత్యకు పోలీసుల నిర్లక్ష్యమే కారణమని అతడి కుటుంబ సభ్యులు ఆరోపణలు చేస్తున్నారు. మృతుడి కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి వైసిపి ఎంఎల్‌ఎ విశ్వేశ్వర రాజు ఆందోళన చేపట్టారు. గతంలో నూకరాజుకు ప్రాణహాని ఉందని చెప్పినా కూడా పోలీసులు పట్టించుకోలేదన్నారు.