అమెరికా లోని భారతీయ విద్యార్థులకు , సాంకేతిక నిపుణులకు శుభవార్త, ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ సెప్టెంబర్ లో ప్రెసిడెంట్ ఆర్డర్ ద్వారా ప్రవేశపెట్టిన లక్ష డాలర్ల హెచ్ -1బి వీసా రుసుము విషయంలో పలు మినహాయింపులను ప్రకటించింది. ఇది అమెరికాలో ఉన్న విదేశీయులు ముఖ్యంగా భారతీయ విద్యార్థులు, సాంకేతిక నిపుణులకు ఊరట కల్గించే విషయం.సడలించిన నిబంధనల ప్రకారం ఎఫ్ – 1 విద్యార్థి వీసాలు, లేదా ఎల్ -1 ప్రొఫెషనల్ వీసాలు వంటి చెల్లుబాటు అయ్యే వీసాలపై ఇప్పటికే అమెరికాలో నివసిస్తున్న వ్యక్తులు, హెచ్ -1 బి వీసాలకు మారేందుకు దరఖాస్తు చేసుకునే టప్పుడు లక్ష డాలర్ల రుసుము చెల్లించనవసరం లేదని అమెరికా పౌరసత్వం, ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ ( యుఎస్ సిఐఎస్) ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ప్రస్తుతం హెచ్ -1 బి వీసా కలిగిన వారులు తమ స్థితిని పునరుద్ధరించుకోవడానికి, లేదా పొడిగించుకోవాలని కోరిన పక్షంలో వారికీ వర్తిస్తుంది. ఈ ప్రకటన ప్రకారం మినహాయింపులు 2025 సెప్టెంబర్ 21 నుంచి అమలులోకి వస్తాయి. అమెరికా వెలుపల ఉన్న, చెల్లుబాటు అయ్యే హెచ్ -1 బి వీసాలు లేని లబ్ధిదారుల తరుపున దాఖలైన కొత్త హెచ్ -1బి పిటిషనర్లకు వర్తిస్తుంది.
గొప్ప విషయం ఏమిటంటే, అమెరికాను విడిచి వెళ్లకుండా ఒక స్థాయి నుంచి మరో స్థాయికి మారే సందర్భంలో , ఉదాహరణకు ఎఫ్ -1 విద్యార్థి స్థితి నుంచి హెచ్ -1 బి స్థితికి మారిన పక్షంలో ఆ స్టేటస్ మార్పుకు కూడా ఈ రుసుము వర్తించదని యుఎస్ సిఐఎస్ స్పష్టం చేసింది. హెచ్ -1 బి వీసా కావాలంటే, దాదాపు రూ. 89 లక్షలు చెల్లించక తప్పని వివాదాస్పద ప్రకటన సెప్టెంబర్ 19 లో వెలువడింది. ఈ ప్రకటన యాజమాన్యాలు, దరఖాస్తు దారులలో గందరగోళానికి దారితీసింది. యుఎస్ సీఐఎస్ తాజా ప్రకటన భారతీయ విద్యార్థులకు, టెక్ నిపుణులకు ఉపశమనం కలిగిస్తుంది. అమెరికా లో ఉన్న అంతర్జాతీయ విద్యార్థులలో వీరే ఎక్కువమంది. 2024 లో హెచ్ -1 బి వీసాలు పొందిన వారిలో 70 శాతం మంది భారతీయ పౌరులే. 2024 లో అమెరికాలో మొత్తం విదేశీ విద్యార్థులలో భారతీయ విద్యార్థులు 27 శాతం మంది. ఉండగా, గత సంవత్సరం కంటే, ఈ ఏడాది 11.8 శాతం పెరిగిందని యుఎస్ ఇమ్మిగ్రేషన్ , కస్టమ్స్ ఎన్ ఫోర్స్ మెంట్ స్టూడెంట్ అండ్ ఎక్స్చేంజ్ విజిటర్ ప్రోగ్రామ్ వార్షిక నివేదిక తెలిపింది. ఇప్పటికే ఉన్న హెచ్ -1బి వీసా హోల్డర్లు,ఆమోదం పొందిన లబ్ధిదారులు ఎలాంటి పరమితులు లేకుండా అమెరికా లోపలకి, బయటకు ప్రయాణించవచ్చునని యుఎస్ సిఐఎస్ హామీ ఇచ్చింది. యుఎస్ సిఐఎస్ దరఖాస్తును తిరస్కరించి ఉంటే, ఆ వ్యక్తి స్టేటస్ మార్పు లేదా పొడిగింపునకు అనర్హుడని భావిస్తే, ఆయా యాజమాన్యాలు రుసుము చెల్లించవలసి ఉంటుందని ఆ ప్రకటన స్పష్టం చేసింది.