దీపావళి పండుగ సందర్భంగా వచ్చే వారం BSE, NSE వరుసగా రెండు రోజులు మూసివేస్తారు. అక్టోబర్ 21న లక్ష్మీ పూజ, అక్టోబర్ 22న బలిప్రతిపద సందర్భంగా సాధారణ ట్రేడింగ్‌కు సెలవు ప్రకటించారు. అయితే, అక్టోబర్ 21న మధ్యాహ్నం వేళ ముహూర్త ట్రేడింగ్ జరగనుంది. మార్కెట్ సెలవులు, కీలక సమయాల పూర్తి వివరాలు ఇక్కడ ఉన్నాయి.