హైదరాబాద్: ప్రజల జీవితాల్లో ప్రగతి వెలుగులు నిండాలని ఆకాంక్ష దీపావళి పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్ శుభాకాంక్షలు తెలిపారు. అజ్ఞానపు తమస్సును తొలగించుకునీ, ప్రతీ మనిషి తనలో జ్ఞానపు ఉషస్సులను వెలిగించుకోవాలనే స్ఫూర్తిని దీపావళి పర్వదినం అందిస్తుందన్నారు. పదేండ్ల బిఆర్‌ఎస్ పాలన రాష్ట్రంలో ప్రగతి వెలుగులు పంచిందని, తెలంగాణ ప్రజల జీవితాలలో కమ్ముకున్న చీకట్లు తొలగి ఆనందపు వెలుగులు నిండాలని ఆకాంక్షించారు. దీపావళి పండుగ సందర్భంగా ప్రతి గడపలో ఆనందం వెల్లివిరియా లని ప్రార్థించారు.