పెర్త్: భారత్‌తో ఆదివారం జరిగిన తొలి వన్డేలో ఆ స్ట్రేలియా ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. వర్షం వల్ల మ్యాచ్‌ను 26 ఓవర్లకు కు దించారు. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 136 పరుగులు చేసిం ది. తర్వాత లక్షఛేదనకు దిగిన ఆస్ట్రేలియా 21.1 ఓవర్లలోనే కేవలం మూడు వికెట్లు మాత్రమే కో ల్పోయి విజయాన్ని అందుకుంది. ఓపెనర్ మిఛెల్ మార్ష్, వికెట్ కీపక్ జోష్ ఫిలిప్, మాట్ రెన్‌షా కంగారూల విజయంలో కీలక పాత్ర పోషించారు. కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడిన మార్ష్ 52 బంతుల్లో 3 సి క్స్‌లు, రెండు ఫోర్లతో 46 పరుగులు చేసి ఔటయ్యాడు. మరో ఓపెనర్ ట్రావిస్ హెడ్ (8), వన్‌డౌన్‌లో వచ్చిన మాథ్యూ షార్ట్ (8) సింగిల్ డిజిట్ స్కోరుకే పెవిలియన్ చేరారు. ఇక దూకుడుగా ఆ డిన ఫిలిప్ 29 బంతుల్లోనే 3 ఫోర్లు, రెండు సిక్సర్ల తో 37 పరుగులు సాధించాడు. రెన్‌షా ఒక ఫోర్, మరో సిక్సర్‌తో 21 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.
తేలిపోయిన బ్యాటర్లు..
అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన భారత్‌ను తక్కువ స్కోరుకే పరిమితం చేయడంలో ఆస్ట్రేలియా బౌలర్లు సఫలమయ్యారు. ఆసీస్ బౌలర్లు కచ్చితమైన లైన్ అండ్ లెన్త్‌తో బౌలింగ్ చేయడమే కాకుండా త్రమం తప్పకుండా వికెట్లను తీశారు. దీంతో భారత్ ఆశించిన స్కోరును సాధించలేక పోయింది. ఓపెనర్లు రోహిత్ శర్మ (8), శుభ్‌మన్ గిల్ (10) జట్టుకు శుభారంభం అందించలేక పోయారు.
వన్‌డౌన్‌లో వచ్చిన విరాట్ కోహ్లి ఖాతా తెరవకుండానే ఔటయ్యాడు. శ్రేయస్ అయ్యర్ (11) కూడా నిరాశ పరిచాడు. అక్షర్ పటేల్ (31), కెఎల్ రాహుల్ (38)లు మాత్రమే కాస్త రాణించారు. మిగతా వారిలో వాషింగ్టన్ సుందర్ (10), నితీశ్ రెడ్డి రెండు సిక్స్‌లతో 19 (నాటౌట్) తమవంతు పాత్ర పోషించారు. ఆస్ట్రేలియా బౌలర్లలో హాజిల్‌వుడ్, ఓవెన, కుహ్నెమాన్ రెండేసి వికెట్లను పడగొట్టారు. ఈ విజయంతో ఆస్ట్రేలియా మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 10 ఆధిక్యాన్ని అందుకుంది.