పెర్త్: ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో భారత సీ నియర్ క్రికెటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలు ఘోరంగా విఫలమయ్యారు. రో-కోలుగా పేరు తెచ్చుకున్న వీరు ఆస్ట్రేలియా సిరీస్‌కు ప్రత్యేక ఆకర్షణగా మారారు. అయితే భారీ అంచనాలతో బరిలోకి దిగిన రోహిత్, కోహ్లిలు పేలవమైన ఆటతో నిరాశ పరిచారు. ఓపెనర్‌గా దిగిన రోహిత్ శర్మ తన స్థాయికి తగ్గ ఆటను కనబరచడంలో విఫలమయ్యాడు. 14 బంతులు ఎదుర్కొన్న రోహిత్ ఓ ఫో ర్‌తో 8 పరుగులు మాత్రమే చేసి హాజిల్‌వుడ్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు. ఇక కోహ్లి అయితే ఖాతా కూడా తెరవకుండానే ఔటయ్యాడు. 8 బంతులను ఎదుర్కొన్న కోహ్లి సున్నాకే పెవిలియన్ దారి పట్టాడు. తొలి బంతి నుంచే ఇబ్బంది పడిన కోహ్లి చి వరికి డకౌట్‌గా వెనుదిరిగాడు. సుదీర్ఘ విరామం త ర్వాత అంతర్జాతీయ క్రికెట్‌లో బరిలోకి దిగిన రోహిత్, కోహ్లిలు పేలవమైన బ్యాటింగ్‌తో నిరాశే మిగిల్చారు. జట్టును ముందుండి నడిపిస్తారని భావిస్తే చెత్త బ్యాటింగ్‌తో తేలిపోయారు. వీరి వైఫల్యం జట్టుపై బాగానే పడింది.
రోహిత్, కోహ్లిలు తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టడంలో విఫలమయ్యారు. ఇప్పటికే టి20,టెస్టు ఫార్మాట్‌లకు రిటైర్మెంట్ ప్రకటించిన కోహ్లి, రోహిత్‌లు కేవలం వన్డేలకే పరిమితమయ్యారు. రానున్న వన్డే వరల్డ్‌కప్ వరకు క్రికెట్‌లో కొనసాగాలని ఇద్దరు భావిస్తున్నా రు. ఇలాంటి స్థితిలో చాలా రోజుల తర్వాత వీరు ఆడుతున్న తొలి సిరీస్ ఇదే కావడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. కోట్లాది మంది అభిమానులు వీరి బ్యాటింగ్ విన్యాసాలను చూడాలని తహతలహలాడారు. అయితే రోకోలు మాత్రం అభిమానుల నమ్మకాన్ని నిలబెట్ట లేకపోయారు. రానున్న మ్యాచుల్లోనైనా వీరు తమ బ్యాట్‌కు పని చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేకుంటే భవిష్యత్తులో టీమిండియాలో చోటు కాపాడు కోవడం చాలా కష్టంతో కూడుకున్న అంశమని చెప్పాలి.