చిట్యాల: నల్లగొండ జిల్లా చిట్యాల మండలం పెద్దకాపర్తిలో ఇంటి పైనున్న వాటర్ ట్యాంక్ పడి తల్లీ కుమారుడు చనిపోయారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… పి నాగమణి అనే మహిళ తన కుటుంబ సభ్యులతో కలిసి హోటల్ ప్రారంభించింది. రేకుల షెడ్డు పై వాటర్ ట్యాంక్ ఏర్పాటు చేశారు. రేకులపై బరువు ఎక్కువగా ఉండడంతో వాటర్ ట్యాంక్ ఒక్కసారిగా కూలిపోయింది. ఈ సంఘటనలో తల్లి పి నాగమణి(32), కుమారుడు వంశీకృష్ణ(6) ఘటనా స్థలంలోనే మరణించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి మృతదేహాలను స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు.