హైదరాబాద్: మావోయిస్టులతో సంబంధాలు తెంచుకోవాలని బిజెపి కేంద్రమంత్రి బండిసంజయ్ సూచించారు. మావోయిస్టులకు మద్దతిస్తున్నతెలంగాణ నేతలకు బండి సంజయ్ హెచ్చరించారు. ఈ సందర్భంగా ఆయన ‘ఎక్స్’ లో పోస్టు చేశారు. మావోస్టులతో సంబంధాలు తెంచుకోకపోతే గుట్టు బయటపెడతామని, మావోయిస్టుల కట్టడితోనే కేంద్ర ఏజెన్సీలు ఆగిపోవు అని అన్నారు. అవినీతి, నేరగాళ్ల లింకులపై కేంద్రం నిఘా పెట్టిందని, ఎవరైనా, ఎంత పెద్ద స్థాయిలో ఉన్నా వదిలి పెట్టేది లేదని హెచ్చరించారు. దేశ భద్రత విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని తప్పుడు మార్గంలో వెళితే ఎంత పెద్ద నేతనైనా వదిలిపెట్టం అని బండిసంజయ్ పేర్కొన్నారు.