తమిళ స్టార్ హీరో సూర్య నటిస్తున్న తాజా చిత్రం ‘కరుప్పు’పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాను డైరెక్టర్ ఆర్.జె.బాలాజీ సమ్‌థింగ్ స్పెషల్‌గా తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్ సినిమాపై అంచనాలను పెంచేశాయి. అయితే దీపావళి కానుకగా ఈ చిత్రం నుండి ఓ మంచి ట్రీట్ ఇస్తున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్‌ను దీపావళి కానుకగా అక్టోబర్ 20న రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ తాజాగా ప్రకటించింది. సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలోని మ్యూజిక్ ఎలా ఉండబోతుందా అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రాన్ని డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్ నిర్మిస్తోంది.