పెర్త్: భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియా 26 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 136 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా ముందు 137 పరుగుల లక్ష్యాన్ని భారత్ ఉంచింది. వర్షం పడుతుండడంతో మ్యాచ్ ను 26 ఓవర్లకు కుదించారు. అక్షర పట్లేల్(31), కెఎల్ రాహుల్(38), నితీష్ కుమార్ రెడ్డి(19) గౌరవ ప్రదమైన పరుగులు చేసి పర్వాలేనిపించారు. కెప్టెన్ గిల్, రోహిత్, విరాట్, శ్రేయస్ అయ్యర్ స్వల్ప స్కోరు వెనుదిరగడంతో భారత జట్టు తక్కువ పరుగులు చేసింది. రోహిత్ శర్మ ఎనిమిది పరుగులు చేసి హజిల్‌వుడ్ బౌలింగ్‌లో రెన్‌షాకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. విరాట్ కోహ్లీ మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో కూపర్‌కు క్యాచ్ ఇచ్చి పరుగులేమీ చేయకుండా డకౌట్ మైదానం వీడాడు. శుభ్‌మన్ గిల్ 10 పరుగులు చేసి నాథన్ ఎలిస్ బౌలింగ్‌లో ఫిలిప్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. శ్రేయస్ అయ్యర్ కూడా 11 పరుగులు చేసి హజిల్ వుడ్ బౌలింగ్ లో ఫిలిప్ప్ కు క్యాచ్ ఔటయ్యాడు. అక్షర పటేల్ 31 పరుగులు చేసి కునేమన్ బౌలింగ్ లో రెన్ షాకు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. వాషింగ్టన్ సుందర్ పది పరుగులు చేసి కునేమన్ బౌలింగ్ లో క్లీన్ బౌల్డయ్యాడు. కెఎల్ రాహుల్ 38 పరుగులు చేసి మిచెల్ ఓన్ బౌలింగ్ లో రెన్ షాకు క్యాచ్ ఇచ్చి మైదానం వీడాడు. హర్షిత్ రాణా ఒక పరుగు చేసి మిచెల్ ఓన్ బౌలింగ్ లో ఫిలిప్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. అర్షదీప్ సింగ్ రనౌట్ రూపంలో వెనుదిరిగాడు. ఆస్ట్రేలియా బౌలర్లలో జోష్ హజిల్ వుడ్, కునెమన్, మిచెల్ ఓన్ తలో రెండు వికెట్లు తీయగా మిచెల్ స్టార్క్, నాథన్ ఎలిస్ చెరో ఒక వికెట్ తీశారు.