రాజేంద్రనగర్: రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ లో పోకిరీ రెచ్చి పోయారు. హైదర్ గూడ బస్ స్టాప్ వద్ద ఓ యువతితో అతడు అసభ్యంగా ప్రవర్తించాడు. ఫోన్ నెంబర్ కావాలంటూ యువతిని పోకిరి అడ్డుకున్నాడు. యువతికి పోకిరి మధ్య పెనుగులాట జరగడంతో అరగంట పాటు ఆమెను అడ్డుకున్నారు. స్థానికులు, యువతి బంధువులు గమనించి పోకిరిని చితకబాది పోలీసులకు అప్పగించారు. స్థానికుల దాడిలో పోకిరి తీవ్రంగా గాయపడడంతో ఆస్పత్రికి తరలించారు. అమీర్ పేట్ నుండి రాజేంద్రనగర్ వరకు యువతిని పోకిరి వెంబడించారు. యువతి హైదర్ గూడ వద్ద బస్ దిగగానే ఆమె వెంట పోకిరి పడ్డాడు. యువతి భయంతో వణికి పోయింది. గత నెల రోజులుగా తన వెంట పడుతున్నాడు అంటూ రాజేంద్రనగర్ పోలీసులకు యువతి ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.