అమరావతి: దర్శకుడు రాంగోపాల్ వర్మ, యాంకర్ స్వప్నలపై కేసు నమోదైంది. రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు మేడా శ్రీనివాస్ రాజమండ్రి త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. హిందూ దేవుళ్లను, ఇండియన్ ఆర్మీని, ఆంధ్రులను దూషించినట్లు ఆరోపణల పేరుతో ఫిర్యాదు చేశారు. ఒక టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో దూషించినట్లు వీడియోలు ఉన్నాయని మేడా శ్రీనివాస్ తెలిపారు. రాంగోపాల్ వర్మతో పాటు యాంకర్ స్వప్నపై చర్యలు తీసుకోవాలని పోలీసులను శ్రీనివాస్ కోరారు. ఇద్దరుపై బిఎన్ఎస్ యాక్టు కింద 487/2025, యు/ఎష్ 196 (1), 197(1) 353, 354,299 ఆర్/డబ్యు (3) పోలీసులు కేసు నమోదు చేశారు.