న్యూఢిల్లీ : జాతీయ రహదారులపై టోల్ ఫీజుల చెల్లింపులకు సంబంధించిన ఫాస్టాగ్‌పై మరో కొత్త సౌలభ్యం కూడా అందుబాటులోకి వచ్చింది. వార్షిక టోల్‌పాస్‌ను ఇకపై మనం ఎవరికైనా గిఫ్ట్‌గా కూడా ఇవ్వొచ్చు. దీపావళి సందర్భంగా జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఎఐ) ఈ కొత్త విధానాన్ని అమల్లోకి తీసుకువచ్చింది. మీరు ఎవరికైతే టోల్‌పాస్‌ను బహుమతిగా ఇవ్వాలనుకుంటున్నారో యాప్‌లోకి వెళ్లి ‘యాడ్ పాస్’ విభాగంలోకి వెళ్లాలి. మనం ఎవరికైతే గిఫ్ట్‌గా ఇవ్వాలనుకుంటున్నామో వారి వాహనం నెంబర్, కాంటాక్ట్ వివరాలు జతపరచాల్సి ఉంటుంది. ఓటీపీ వెరిఫికేషన్ తర్వాత వార్షిక పాస్ యాక్టివేట్ అవుతుంది. దాని తర్వాత మీ ద్వారా బహుమతిగా పొందిన వ్యక్తి దాన్ని ఉపయోగించుకునే సౌలభ్యం దొరుకుతుంతని ఎన్‌హెచ్‌ఎఐ ఒక ప్రకటనలో వెల్లడించింది. ఇదిలావుండగా ఏడాదికి రూ.3వేలతో వార్షిక టోల్ పాస్ తీసుకుంటే ఏడాది పాటు లేదా 200 సార్లు టోల్‌ప్లాజాలు దాటే అవకాశం కల్పిస్తున్న సంగతి తెలిసిందే.