కాబూల్: పాకిస్థాన్ వైమానిక దాడిలో ముగ్గురు ఆఫ్ఘాన్ క్రికెటర్ల మృతి చెందారు. పాక్టికా ప్రావిన్స్‌లో పాకిస్తాన్ వైమానిక దాడి జరిపింది. ముగ్గురు ఆఫ్ఘనిస్థాన్ క్రికెటర్ల సహా 8 మంది చనిపోయారు. పాక్, శ్రీలంకతో ట్రైసిరీస్ ఆడేందుకువెళ్తుండగా ఈ దాడి జరిగింది. మృతి చెందిన క్రికెటర్లు కబీర్, సిబాతుల్లా, హరూన్‌గా ఆప్ఘాన్ క్రికెట్ బోర్డు అధికారులు వెల్లడించారు. విమానంలో క్రికెటర్లు ఉర్ఘున్ నుంచి షారానా వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనపై ఆప్ఘనిస్థాన్ క్రికెట్ బోర్డు దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. మృతులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించింది. గత వారం రోజుల నుంచి పాకిస్థాన్ అఫ్గానిస్థాన్ సరిహద్దుల్లో రెండు దేశాల సైనికులు కాల్పులు జరుపుకోవడంతో వందల మంది మృతి చెందారు. చనిపోయిన వారిలో సైనికులు కూడా ఉన్నారు.