కొత్త ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు కోసం కాంట్రాక్టర్ నుంచి లంచం తీసుకుంటుండగా విద్యుత్ శాఖ ఏఈని ఎసిబి అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. రాజేంద్రనగర్, గంధంగూడ విద్యుత్ సబ్ స్టేషన్ పరిధిలోని హిమాయత్‌సాగర్ అమర్ సింగ్ అసిస్టెంట్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. ఆర్‌సికే ప్రాజెక్ట్ పేరుతో అపార్ట్‌మెంట్లు నిర్మిస్తున్నారు. అపార్ట్‌మెంట్‌లో ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు చేసేందుకు అనుమాతి కావాల్సి ఉండడంతో కాంట్రాక్టర్ ఎఈని సంప్రదించారు. ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు చేసేందుకు అమర్ సింగ్ రూ.30,000 డిమాండ్ చేశాడు. దీంతో బాధితులు ఎసిబికి ఫిర్యాదు చేశారు. ఎసిబి అధికారుల సూచనల మేరకు ఎఈ అమర్ సింగ్‌కు రూ.30వేలు ఇస్తుండగా ఎసిబి అధికారులు పట్టుకున్నారు. గంధంగూడ విద్యుత్ కార్యాలయంలో ఎసిబి అధికారులు సోదాలు చేశారు. ఎఈని అరెస్టు చేసి నాంపల్లిలోని ఎసిబి కోర్టులో ప్రవేశపెట్టారు. కోర్టు ఆదేశాలతో ఎఈ అమర్ సింగ్‌ను చంచల్‌గూడ జైలుకు తరలించారు.