హైదరాబాద్: బిసి రిజర్వేషన్ల అంశం బలహీనవర్గాల డిమాండ్ అని మంద కృష్ణ మాదిగ తెలిపారు. బిసి రిజర్వేషన్లు తెలంగాణ పౌర సమాజం అంగీకరిస్తున్న అంశమని, తెలంగాణ సంపూర్ణ బంద్‌తో దేశానికి సంకేతం పంపినట్లుగా ఉందని పేర్కొన్నారు. బిసి రిజర్వేషన్ల కోసం చేసిన ధర్నాలో మంద కృష్ణ మాదిగ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. అగ్రకులాల పేదల పేరుతో ఇడబ్ల్యుఎస్ రిజర్వేషన్లు అమలు చేశారని, ఇడబ్లుఎస్ రిజర్వేషన్లలో భాగంగా పది శాతం అమలు చేస్తున్నారని, అగ్రకులాల పేదల జనాభాకు మించి రిజర్వేషన్ల అమలు జరుగుతోందని మండిపడ్డారు. ఇడబ్లుఎస్ రిజర్వేషన్లు తీసుకొచ్చినప్పుడే 50 శాతం రిజర్వేషన్లు దాటిపోయాయని, 50 శాతం రిజర్వేషన్లు నిబంధన బిసి ప్రజలకు మాత్రమేనా? అని ప్రశ్నించారు. ఇడబ్ల్యుఎస్ రిజర్వేషన్లతో 50 శాతం దాటినప్పుడు బిసి రిజర్వేషన్ల కోసం అడ్డంకి ఎందుకు అని అడిగారు. ఇడబ్లుఎస్ రిజర్వేషన్లకు రాని అడ్డుంకులు బిసి రిజర్వేషన్లకు ఎందుకు అని నిలదీశారు. రాష్ట్రానికి ఒకతీరుగా రిజర్వేషన్ల అంశం ఉండొద్దని, బిసిలకు 42 శాతం రిజర్వేషన్లను అన్ని పార్టీలు అంగీకరించాల్సిన పరిస్థితి ఏర్పండిందన్నారు. తమిళనాడులో అడ్డుకోనప్పుడు తెలంగాణలో అడ్డుకోవడం న్యాయమా? అని మంద కృష్ణ ప్రశ్నించారు.