హైదరాబాద్: పదేపదే బిజెపి, కాంగ్రెస్ పార్టీలు బిసిలను మోసం చేస్తున్నాయని ఎంఎల్ సి కవిత మండిపడ్డారు. రాజకీయ పార్టీలు చేసిన మోసాలతో బిసిలు అన్యాయానికి గురవుతున్నారన్నారు. ఇప్పటికైనా మోసాలకి అడ్డుకట్ట వేయాలని సూచించారు. బిసిల బంద్ కు మద్దతుగా ఖైరతాబాద్ చౌరస్తాలో మానవహారం నిర్మించేందుకు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆటోలతో ర్యాలీగా బయల్దేరారు. బిసిలకు 42 శాతం రిజర్వేషన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ బిసి సంఘాలు రాష్ట్ర వ్యాప్త బంద్ కు పిలుపునిచ్చాయి. ఆర్ టిసి బస్సులు హైదరాబాద్‌లో డిపోలకే పరిమితమయ్యాయి. రాజేంద్రనగర్, దిల్‌సుఖ్‌నగర్, బండ్లగూడ, హయత్‌నగర్, బర్కత్‌పురా, ఇబ్రహీంపట్నం సహా ఆర్టీసీ డిపోల్లో బస్సులు నిలిచిపోయాయి. ఎంజిబిఎస్ ముందు బిసి సంఘాల నేతల ఆందోళన చేపట్టారు. జూబ్లీ బస్ స్టేషన్‌లో బిసి సంఘాల బైఠాయించారు. జెబిఎస్ దగ్గర బంద్‌లో ఎంపి ఈటెల రాజేందర్, బిజెపి నేతలు పాల్గొన్నారు. బిసి బంద్‌తో కాకతీయ విశ్వవిద్యాలయంలో పరీక్షలు వాయిదా వేసినట్లు అధికారులు ప్రకటించారు.