న్యూఢిల్లీ: పాకిస్థాన్‌లోని ప్రతి అంగుళం బ్రహ్మోస్ రేంజ్‌లోనే ఉందని రక్షణ శాఖ మంత్రి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఆపరేషన్ సిందూర్ ట్రైలర్ మాత్రమే అని ఆయన అన్నారు. ఉత్తర్‌ప్రదేశ్ రాజధాని లక్నోని బ్రహ్మోస్ ఏరోస్పేస్ యూనిట‌్‌ను రక్షణ మంత్రి సందర్శించారు. బ్రహ్మోస్ క్షిపణులను ఆయన సైన్యానికి అప్పగించారు. ఈ కార్యక్రమంలో యూపి సిఎం యోగి ఆదిత్యనాథ్ కూడా ఉన్నారు. తొలి విడత బ్రహ్మోస్ క్షిపణులను తయారు చేశారు. వాటిని కేంద్ర మంత్రి సైన్యానికి అప్పగించారు. ఈ సందర్భంగా సైన్యం పరాక్రమం, సంసిద్ధతను ప్రశంసించారు. భారత్ వద్ద ఉన్న అధునాతన క్షిపణి సామర్థ్యాల నుంచి శతృదేశ: తప్పించుకోలేదని రాజ్‌నాథ్ వార్నింగ్ ఇచ్చారు.