రిషబ్ శెట్టి హీరోగా, స్వీయ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘కాంతార: ఛాప్టర్ 1’. 2022లో వచ్చి ‘కాంతార’ సినిమాకు ఇది ప్రీక్వెల్. ప్రస్తుతం ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రచ్చలేపుతోంది. కలెక్షన్ల పరంగా దూసుకుపోతుంది. విడుదలైన రెండు వారాల్లోనే రూ.717 కోట్ల వసూళ్లు రాబట్టింది. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు సోషల్‌మీడియాలో పోస్ట్ పెట్టింది. ఇందులో రూ.105 కోట్లు తెలుగు రాష్ట్రాల నుంచ రాబట్టినట్లు సినీ వర్గాలు వెల్లడించాయి. ఇప్పటివరకూ అత్యధిక కలెక్షన్లు రాబట్టిన రెండో కన్నడ సినిమాగా ‘కాంతార: ఛాప్టర్ 1’ నిలిచింది. ఈ లిస్ట్‌లో మొదటి స్థానంలో రూ.1200+ కోట్లతో ‘కెజిఎఫ్-2’ మొదటి స్థానంలో ఉంది.
అక్టోబర్ 2వ తేదీన విడుదలైన ‘కాంతార: ఛాప్టర్ 1’ రిలీజ్ రోజే అత్యధిక వసూళ్లు (రూ.89+ కోట్లు) చేసిన కన్నడ సినిమాగా నిలిచింది. 24 గంటల్లో ‘బుక్ మై షో’లో 1.28 మిలియన్లకు పైగా టికెట్లు అమ్ముడుపోయాయి. ఈ పోర్టల్‌లో ఈ ఏడాది ఈ రేంజ్‌లో టికెట్లు సేల్ కావడం విశేషం.