హైదరాబాద్: కాంట్రాక్టుల్లో వాటాల కోసం కాంగ్రెస్ నేతల మధ్య తగాదాలు వస్తున్నాయని బిఆర్ఎస్ మాజీ మంత్రి హరీశ్ రావు తెలిపారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత రాష్ట్రానికి ఈ ఏడాది అతి తక్కువ పరిశ్రమలు వచ్చాయని అన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ భవన్ లోహరీశ్ రావు మీడియాతో మాట్లాడుతూ.. మంత్రుల పంచాయితీ చెప్పుకోవడానికే కేబినేట్ మీటింగ్ అని మంత్రులు గ్రూపులుగా విడిపోయారని, కాంగ్రెస్ పాలనలో పెట్టుబడులు రావడం లేదని విమర్శించారు. దండుపాళ్యంలో ముఠాకంటే అధ్వాన్నంగా మారిందని, కాంగ్రెస్ రియల్ ఎస్టేట్ వ్యాపారులను బెదిరిస్తున్నారని మండిపడ్డారు. మాజీ సిఎం కెసిఆర్ ఢిల్లీకి తిరిగి లోకల్ రిజర్వేషన్ల వాట, నీళ్ల వాటాను సాధించారని కొనియాడారు. తమ హయాంలో పారిశ్రామిక వేత్తలకు ప్రాధాన్యత ఇచ్చామని అన్నారు. మీరు వ్యాపార వేత్తలకు తుపాకులు పెడుతున్నారని గన్ కల్చర్ తెచ్చారని హరీశ్ రావు ఎద్దేవా చేశారు.