పెర్త్: భారత్-ఆస్ట్రేలియాల మధ్య వన్డే సిరీస్ మరో రెండు రోజుల్లో ప్రారంభం కానుంది, తొలుత వన్డేల్లో, ఆ తర్వాత టి-20 సిరీస్‌లలో ఇరు జట్లు తలపడనున్నాయి. ఇప్పటిక టీం ఇండియాలోని కొందరు ఆటగాళ్లు ఆస్ట్రేలియాకు చేరుకొని.. ప్రాక్టీస్ ప్రారంభించారు. మరో వైపు ఆస్ట్రేలియా కూడా భారత్‌కు గట్టి పోటీ ఇఛ్చేందకు రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో తొలి వన్డేకు ముందు ఆస్ట్రేలియాకు అనుకొని షాక్ తగిలింది.
ఆష్ట్రేలియా ఆల్ రౌండర్ కామెరాన్ గ్రీన్ వన్డే సిరీస్‌కి దూరమయ్యాడు. కొంతకాలంగా వెన్ను గాయంతో గ్రీన్ 12 నెలల పాటు క్రికెట్‌కి దూరమయ్యాడు. ఈ ఏడాది ఫిబ్రవరిలో గ్రీన్ మళ్లీ జట్టులో చోటు సంపాదించుకున్నాడు. కానీ, ఆ సిరీస్‌లో అతడి కేవలం స్పెషలిస్ట్ బ్యాటర్‌గా మాత్రమే ఆడాడు. దీంతో ఇప్పుడు బౌలింగ్‌లో తన సత్తా చాటాలనేరు ఉద్దెశ్యంతో నెట్స్‌లో ప్రాక్టీస్ చేశాుడు. ఈ క్రమలో మరోసారి అడుతుండగా.. అతనికి మళ్లీ గాయమైంది. దీంతో అతడిని వన్డే సిరీస్ నుంచి తప్పించారు. గ్రీన్ స్థానంల మార్నస్ లాబుషేన్‌ని క్రికెట్ ఆస్ట్రేలియా జట్టులోకి తీసుకుంది.