మన తెలంగాణ/హైదరాబాద్: ప్రభుత్వంలోని ప లు శాఖల్లో భారీగా బోగస్ ఉద్యోగులు ఉన్న ట్లు అధికారుల విచారణలో బయటపడింది. బో గస్ ఉద్యోగుల పేరుతో నెలనెల జీతాలు తీసుకుంటూ వేల కోట్లు ప్రభు త్వ ఖజానాకు గండి కొట్టినట్లుగా తేలింది. వారి వల్ల ఏటా రూ.1,500 కోట్ల జీతాలు దుబారా అయ్యాయని ప్రభుత్వం గుర్తించింది. గడిచిన పదేండ్లలో ఈ బోగస్ ఉద్యోగుల పేరిట రూ.15 వేల కోట్లు ప్రభుత్వ ఖ జానాకు గండిపడినట్టుగా అధికారిక వర్గా లు పేర్కొంటున్నాయి. గత ప్రభుత్వంలో ఔ ట్ సోర్సింగ్ ఏజెన్సీలను, కాంట్రాక్టు మ్యాన్ పవ ర్ కంపెనీలను ఏర్పాటు చేసిన కొందరు నాయకులు, బడాబాబులు బోగస్ ఉద్యోగుల పేరుతో దోచుకున్నట్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం ఒక అంచనాకు వచ్చింది. దీంతో బోగస్ ఉద్యోగుల జీతాలను ఈ నెల (అక్టోబర్) నుంచి నిలిపివేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్టుగా సమాచారం.
మా జీ సిఎస్ శాంతికుమారి ఆధ్వర్యంలో వేసిన త్రిస భ్య కమిటీ రిపోర్టులో ఈ వాస్తవాలు బయటపడ్డాయి. రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు లక్షల మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ఉన్న ట్లు తేల్చిన కమి టీ అందులో కేవలం రెం డు లక్షల మంది పూర్తిస్థాయిలో ఉన్నట్లుగా గుర్తించారు. సెప్టెంబర్ 30 వరకు సగం మంది ఉద్యోగులు మాత్రమే బ్యాం క్ ఖాతాలు, తమ ఆధార్ వివరాలను ఇచ్చారు. మిగిలిన వారు ఈనెల 25వ తేదీ వరకు ఆధార్ వివరాలివ్వాలని కమిటీ ఆదేశాలు జారీ చేసింది. అయినా ఇప్పటివరకు వారి వివరాలు అందకపోవడం విశేషం. అయితే, ఈ కుంభకోణం పదేళ్ల బిఆర్‌ఎస్ సర్కార్ హయాంలోనే చోటుచేసుకుందని, అప్పటినుంచి ఇది కొనసాగుతుందని ప్రభు త్వం గుర్తించింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల కుంభకోణంపై ప్రభుత్వానికి పలు ఫిర్యాదులు అందా యి. ఈ నేపథ్యంలోనే సిఎం రేవంత్‌రెడ్డికి శాఖల వారీగా వివరాలు కావాలని అన్ని శాఖల అధికారులను
ఆదేశించారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్రస్థాయిలో అన్ని డిపార్ట్‌మెంట్‌లలో పనిచేస్తున్న ఉద్యోగుల వివరాలను ప్రభుత్వం సేకరించింది. దీంతోపాటు ఒక కమిటీని ప్రభుత్వం నియమించి పూర్తిస్థాయిలో దీనిపై నివేదిక తెప్పించుకుంది. ఆ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల విషయంలో భారీగా అవకతవకలు జరిగినట్టుగా ప్రభుత్వం గుర్తించింది. ఆరు నెలల క్రితం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అమల్లోకి తీసుకొచ్చిన ఫేస్ రికగ్నేషన్ సిస్టంతో ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల కుంభకోణంపై ప్రభుత్వానికి మరింత క్లారిటీ వచ్చినట్టుగా తెలుస్తోంది.
జిహెచ్‌ఎంసిలోనే 6వేల మంది బోగస్
బోగస్ ఉద్యోగుల జీతాల విషయంలో ఈనెల 25వ తేదీ తరువాత ప్రభుత్వం ఒక ప్రకటన చేసే అవకాశం ఉందని, ఈ కుంభకోణంలో పాత్రదారులపై చర్యలు తీసుకునే అవకాశం ఉందని అధికారికవర్గాలు పేర్కొంటున్నాయి. ప్రస్తుతం కమిటీ ఇచ్చిన రికార్డుల ప్రకారం ఒక్క గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో (జిహెచ్‌ఎంసి) 21 వేల మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులున్నారు. అసలు పని చేస్తున్న ఉద్యోగులు 15 వేలు మాత్రమేనని, మిగతా 6 వేలు బోగస్ అని అధికారులు పేర్కొంటున్నారు. ఇలా పలు శాఖల్లో కాగితాలపై చూపిన లెక్కలకు పనిచేస్తున్న వారికి పొంతన లేదని ప్రభుత్వం గుర్తించింది.
వివరాలు ఇవ్వని 2,18,976 మంది
రాష్ట్ర ప్రభుత్వం 31 శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగుల సమాచారాన్ని ఇప్పటికే డేటాబేస్‌లో పొందుపరిచింది. ఈ నేపథ్యంలోనే రాష్ట్రవ్యా ప్తంగా 5,21,692 మంది రెగ్యులర్ ఉద్యోగులు ఉండగా అందులో 2,22,376 మంది ఉద్యోగులు మాత్రమే తమ డేటాబేస్‌ను ప్రభుత్వానికి అందించారు. వీరితో పాటు 4,93,820 మంది తాత్కాలిక ఉద్యోగులకు గాను 2,74,844 మంది ఉద్యోగులు మాత్రమే తమ వివరాలను ప్రభుత్వానికి అందించారని మిగతా 2,25,462 మంది వివరాలు ఇవ్వలేదని ప్రభుత్వానికి అందించిన నివేదికలో కమిటీ పేర్కొన్నట్టుగా తెలిసింది. అయితే, ఈనెల 25వ తేదీలోపు రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయమై చర్యలు చేపట్టే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు. రెగ్యులర్ ఉద్యోగులు, టెంపరెరీ ఉద్యోగుల వివరాలు ప్రస్తుతం ప్రభుత్వానికి అందాయి. వాటికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
శాఖల వారీగా వివరాలు ఇలా….
అగ్రికల్చర్ అండ్ కో ఆపరేటివ్ డిపార్ట్‌మెంట్‌లో రెగ్యులర్ ఉద్యోగులు 8,477 మంది ఉండగా ఇప్పటివరకు 7,464 మంది డేటా అప్‌లోడ్ కాగా, 2,545 టెంపరరీ ఉద్యోగులకు గాను 4,574 మంది ఉద్యోగుల డేటా అప్‌లోడ్ కావడం విశేషం. ఇక, పశుసంవర్ధకశాఖ, డైరీ డెవలప్‌మెంట్‌లో రెగ్యులర్ ఉద్యోగులు 5,218 మంది ఉండగా ఇప్పటివరకు 216 మంది డేటా అప్‌లోడ్ కాగా, 3,803 టెంపరరీ ఉద్యోగులకు గాను 2,872 మంది ఉద్యోగుల డేటా అప్‌లోడ్ అయ్యింది. బిసి వెల్ఫేర్ శాఖలో రెగ్యులర్ ఉద్యోగులు 7,093 మంది ఉండగా ఇప్పటివరకు 1,039 మంది డేటా అప్‌లోడ్ కాగా, 4,983 టెంపరరీ ఉద్యోగులకు గాను 5,135 మంది ఉద్యోగుల డేటా ప్రభుత్వానికి అందింది. సివిల్ సప్లయ్ శాఖలో రెగ్యులర్ ఉద్యోగులు 1,099 మంది ఉండగా ఇప్పటివరకు 558 మంది డేటా అప్‌లోడ్ కాగా, 857 టెంపరరీ ఉద్యోగులకు గాను 60 మంది ఉద్యోగుల డేటా ప్రభుత్వానికి అందింది. విద్యుత్ శాఖలో రెగ్యులర్ ఉద్యోగులు 73,171 మంది ఉండగా
ఇప్పటివరకు 44 మంది డేటా అప్‌లోడ్ కాగా, 22,223 టెంపరరీ ఉద్యోగులకు గాను 9 మంది ఉద్యోగుల డేటా అందింది. పర్యావరణ, అటవీశాఖ, సైన్స్ అండ్ టెక్నాలజీలో రెగ్యులర్ ఉద్యోగులు 4,629 మంది ఉండగా ఇప్పటివరకు 2,755 మంది డేటా అప్‌లోడ్ కాగా, 860 టెంపరరీ ఉద్యోగులకు గాను 32 మంది ఉద్యోగుల డేటా అందింది. ఆర్థికశాఖలో రెగ్యులర్ ఉద్యోగులు 2,672 మంది ఉండగా ఇప్పటివరకు 2,933 మంది డేటా అప్‌లోడ్ కాగా, 540 టెంపరరీ ఉద్యోగులకు గాను 326 మంది ఉద్యోగుల డేటా అప్‌లోడ్ అయ్యింది. జిఏడిలో రెగ్యులర్ ఉద్యోగులు 1,862 మంది ఉండగా ఇప్పటివరకు 2,345 మంది డేటా అప్‌లోడ్ కాగా, 1600 మంది టెంపరరీ ఉద్యోగులకు గాను 764 మంది ఉద్యోగుల డేటా అప్‌లోడ్ అయ్యింది. వైద్య, ఆరోగ్య శాఖలో రెగ్యులర్ ఉద్యోగులు 35,903 మంది ఉండగా ఇప్పటివరకు 14,876 మంది డేటా అప్‌లోడ్ కాగా, 60,934 మంది టెంపరరీ ఉద్యోగులకు గాను 62,801 మంది ఉద్యోగుల డేటా అప్‌లోడ్ చేశారు.
ఉన్నత విద్యా శాఖలో రెగ్యులర్ ఉద్యోగులు 16,177 మంది ఉండగా ఇప్పటివరకు 11,213 మంది డేటా అప్‌లోడ్ కాగా, 13,894 మంది టెంపరరీ ఉద్యోగులకు గాను 3,365 మంది ఉద్యోగుల డేటాను అధికారులు అప్‌లోడ్ చేశారు. హోంశాఖలో రెగ్యులర్ ఉద్యోగులు 82,424 మంది ఉండగా ఇప్పటివరకు 29,789 మంది డేటా అప్‌లోడ్ కాగా, 21,765 మంది టెంపరరీ ఉద్యోగులకు గాను 19,594 మంది ఉద్యోగుల డేటా అప్‌లోడ్ అయ్యింది. హౌజింగ్ శాఖలో రెగ్యులర్ ఉద్యోగులు 444 మంది ఉండగా, 289 మంది టెంపరరీ ఉద్యోగుల డేటా అప్‌లోడ్ అయ్యింది. పరిశ్రమల శాఖలో రెగ్యులర్ ఉద్యోగులు 965 మంది ఉండగా ఇప్పటివరకు 472 మంది డేటా అప్‌లోడ్ కాగా, 1,264 మంది టెంపరరీ ఉద్యోగులకు గాను 77 మంది ఉద్యోగుల డేటా అప్‌లోడ్ అయ్యింది. ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ శాఖలో రెగ్యులర్ ఉద్యోగులు 64 మంది ఉండగా ఇప్పటివరకు 11 మంది డేటా అప్‌లోడ్ కాగా, 668 మంది టెంపరరీ ఉద్యోగులకు గాను 23 మంది ఉద్యోగుల డేటా అప్‌లోడ్ అయ్యింది.
ఇరిగేషన్ అండ్ కమాండ్ ఏరియా డెవలప్‌మెంట్ శాఖలో రెగ్యులర్ ఉద్యోగులు 12,494 మంది ఉండగా ఇప్పటివరకు 9,381 మంది డేటా అప్‌లోడ్ కాగా, 1,524 మంది టెంపరరీ ఉద్యోగులకు గాను 742 మంది ఉద్యోగుల డేటా అప్‌లోడ్ అయ్యింది. కార్మిక, ఎంప్లాయిమెంట్ ట్రైనింగ్ శాఖలో రెగ్యులర్ ఉద్యోగులు 3,062 మంది ఉండగా ఇప్పటివరకు 1,840 మంది డేటా అప్‌లోడ్ కాగా, 1,312 మంది టెంపరరీ ఉద్యోగులకు గాను 1,056 మంది ఉద్యోగుల డేటా అప్‌లోడ్ అయ్యింది. లా డిపార్ట్‌మెంట్‌లో రెగ్యులర్ ఉద్యోగులు 9,373 మంది ఉండగా ఇప్పటివరకు 2,474 మంది డేటా అప్‌లోడ్ కాగా, 2,304 మంది టెంపరరీ ఉద్యోగులకు గాను 505 మంది ఉద్యోగుల డేటా అప్‌లోడ్ అయ్యింది. లేజిస్లేటర్‌లో రెగ్యులర్ ఉద్యోగులు 249 మంది ఉండగా 166 మంది టెంపరరీ ఉద్యోగులకు గాను 126 మంది ఉద్యోగుల డేటా అప్‌లోడ్ అయ్యింది.
ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్‌లో రెగ్యులర్ ఉద్యోగులు 1,17,167 మంది…
వీటితో పాటు మైనార్టీ వెల్ఫేర్ శాఖలో రెగ్యులర్ ఉద్యోగులు 4,439 మంది ఉండగా ఇప్పటివరకు 144 మంది డేటా అప్‌లోడ్ కాగా, 20,903 మంది టెంపరరీ ఉద్యోగులకు గాను 16,903 మంది ఉద్యోగుల డేటా అప్‌లోడ్ అయ్యింది. పురపాలక శాఖలో రెగ్యులర్ ఉద్యోగులు 17,436 మంది ఉండగా ఇప్పటివరకు 3,267 మంది డేటా అప్‌లోడ్ కాగా, 62,913 మంది టెంపరరీ ఉద్యోగులకు గాను 35,203 మంది ఉద్యోగుల డేటా అప్‌లోడ్ అయ్యింది. పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్‌లో రెగ్యులర్ ఉద్యోగులు 27,266 మంది ఉండగా ఇప్పటివరకు 18,014 మంది డేటా అప్‌లోడ్ కాగా, 94,179 మంది టెంపరరీ ఉద్యోగులకు గాను 26,337 మంది ఉద్యోగుల డేటా అప్‌లోడ్ అయ్యింది. ప్లానింగ్ డిపార్ట్‌మెంట్‌లో రెగ్యులర్ ఉద్యోగులు 944 మంది ఉండగా ఇప్పటివరకు 667 మంది డేటా అప్‌లోడ్ కాగా, 184 మంది టెంపరరీ ఉద్యోగులకు గాను72 మంది ఉద్యోగుల డేటా అప్‌లోడ్ అయ్యింది. పబ్లిక్ ఎంటర్‌ప్రైజేస్‌లో రెగ్యులర్ ఉద్యోగులు 04 మంది ఉన్నారు.
04 మంది టెంపరరీ ఉద్యోగులకు గాను 04 మంది ఉద్యోగుల డేటా అప్‌లోడ్ అయ్యింది. రెయిన్ షాడో ఏరియా డెవలప్‌మెంట్‌లో రెగ్యులర్ ఉద్యోగులు 01 ఒక్కరూ ఉండగా ఇప్పటివరకు 01 ఒక్కరి డేటా అప్‌లోడ్ కాగా, 02 మంది టెంపరరీ ఉద్యోగులకు గాను 02 మంది ఉద్యోగుల డేటా అప్‌లోడ్ అయ్యింది. రెవెన్యూ డిపార్ట్‌మెంట్‌లో రెగ్యులర్ ఉద్యోగులు 25,006 మంది ఉండగా ఇప్పటివరకు 10,090 మంది డేటా అప్‌లోడ్ కాగా, 12,843 మంది టెంపరరీ ఉద్యోగులకు గాను 8,764 మంది ఉద్యోగుల డేటా అప్‌లోడ్ అయ్యింది. షెడ్యూల్ క్యాస్ట్ డెవలప్‌మెంట్ డిపార్ట్‌మెంట్‌లో రెగ్యులర్ ఉద్యోగులు 8,339 మంది ఉండగా ఇప్పటివరకు 1,326 మంది డేటా అప్‌లోడ్ కాగా, 5,928 మంది టెంపరరీ ఉద్యోగులకు గాను 897 మంది ఉద్యోగుల డేటా అప్‌లోడ్ అయ్యింది. సెకండరీ ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్‌లో రెగ్యులర్ ఉద్యోగులు 1,17,167 మంది ఉండగా ఇప్పటివరకు 93,992 మంది డేటా అప్‌లోడ్ కాగా, 78,146 మంది టెంపరరీ ఉద్యోగులకు గాను 20,258 మంది ఉద్యోగుల డేటా అప్‌లోడ్ అయ్యింది. ట్రాన్స్‌పోర్ట్, రోడ్లు, భవనాల శాఖలో రెగ్యులర్ ఉద్యోగులు 43,757 మంది ఉండగా ఇప్పటివరకు 2,345 మంది డేటా అప్‌లోడ్ కాగా, 7,822 మంది టెంపరరీ ఉద్యోగులకు గాను 601 మంది ఉద్యోగుల డేటా అప్‌లోడ్ అయ్యింది. ట్రైబల్ వెల్ఫేర్‌లో రెగ్యులర్ ఉద్యోగులు 8,375 మంది ఉండగా
ఇప్పటివరకు 2,396 మంది డేటా అప్‌లోడ్ కాగా, 6,555 మంది టెంపరరీ ఉద్యోగులకు గాను 3,045 మంది ఉద్యోగుల డేటా అప్‌లోడ్ అయ్యింది. ఉమెన్, చిల్డ్రన్స్, డిసెబుల్డ్ అండ్ సీనియర్ సిటీజన్ డిపార్ట్‌మెంట్‌లో రెగ్యులర్ ఉద్యోగులు 2,801 మంది ఉండగా ఇప్పటివరకు 2,045 మంది డేటా అప్‌లోడ్ కాగా, 60,492 మంది టెంపరరీ ఉద్యోగులకు గాను 59,375 మంది ఉద్యోగుల డేటా అప్‌లోడ్ అయ్యింది. యూత్ అడ్వాన్స్‌మెంట్, టూరిజం డిపార్ట్‌మెంట్‌లో రెగ్యులర్ ఉద్యోగులు 781 మంది ఉండగా ఇప్పటివరకు 679 మంది డేటా అప్‌లోడ్ కాగా, 2,336 మంది టెంపరరీ ఉద్యోగులకు గాను 1,322 మంది ఉద్యోగుల డేటా అప్‌లోడ్ అయ్యింది.