బాత్‌రూమ్‌లో సీక్రెట్ కెమెరా పెట్టి కటకటాలపాలయ్యడు ఇంటి యజమాని. ఈ సంఘటన జవహర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం…జవహర్‌నగర్, మధురానగర్‌కు చెందిన అశోక్ ఇంటిలో దంపతులు అద్దెకు ఉంటున్నారు. అక్టోబర్ 4వ తేదీన బాత్‌రూమ్‌లో బల్బు పాడైపోవడంతో ఇంటి యజమాని అశోక్, ఎలక్ట్రిషియన్ చింటూతో కలిసి కొత్తది ఏర్పాటు చేశాడు. హోల్డర్‌లో నిందితుడు సిసి కెమెరాలను అమర్చాడు. ఈ విషయం ఈ నెల 13వ తేదీన అద్దెకు ఉంటున్న దంపతులు గుర్తించారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేసిన దంపతులపై అశోక్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అశోక్‌ను అరెస్టు చేయగా, ఎలక్ట్రిషియన్ చింటూ పరారీలో ఉన్నాడు. నిందితుడి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.