అమరావతి: అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం కలగాసుపల్లి క్రాస్ వద్ద ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ప్రైవేటు బస్సు దగ్దం అయ్యిది. బెంగళూరు నుంచి రాయచూర్ వెళ్తున్న ప్రైవేటు బస్సులో టైరు పేలి మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో డ్రైవర్ అప్రమత్తంగా ఉండడంతో ప్రాణనష్టం తప్పింది. స్థానికుల సమాచారం మేరకు అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.