ఇస్లామాబాద్: పాకిస్థాన్ క్రికెట్ జట్టుకు ప్రస్తుతం బ్యాడ్ టైమ్ నడుస్తోంది. లీగ్ ఏదైనా సరే చెత్త ప్రదర్శనలతో విమర్శలు ఎదురుకుంటోంది. తమ దేశం ఆతిథ్యమిచ్చిన ఛాంపియన్స్ ట్రోఫీలో లీగ్ దరశలోనే వైదొలిగిన పాక్.. కొద్ది రోజుల క్రితం జరిగిన ఆసియాకప్‌లో ఫైనల్స్ వరకూ వచ్చి భారత్ చేతిలో చిత్తయింది. దీంతో జట్టులో మార్పలు చేయాలని పాకిస్థాన్ క్రికెట్ బోడర్డు నిర్ణయం తీుకుందని తెలుస్తోంది. ముఖ్యంగా టి-20 జట్టులో ప్రస్తుత ఉన్న కెప్టెన్‌ని తప్పించి అతడి స్థానంలో మరో యువ క్రికెటర్‌కు ఆ బాధ్యతలు అప్పిగిస్తారని టాక్.
యువ క్రికెటర్ షాదాబ్ ఖాన్.. గాయం కారణంగా ఆసియా కప్‌కి దూరమయ్యాడు. అతడు తిరిగి జట్టు లోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నాడు. ప్రస్తుతం పాక్‌కి కెప్టెన్ సల్మాన్ అఘా నాయకత్వంలో పాకిస్తాన్ 30 టి20 మ్యాచ్‌లలో 17 విజయాలు సాధించినప్పటికీ.. అతడి బ్యాటింగ్ ప్రదర్శన మాత్రం దారుణంగా పడిపోయింది. ఆసియాకప్-2025లో 7 మ్యాచ్‌లు ఆడిన అఘా.. 12 సగటుతో 72 పరుగులు చేశాడు. దీంతో సల్మాన్‌ని కెప్టెన్సీ నుంచి తప్పించి.. షాదాబ్‌కు ఆ బాధ్యతలు ఇవ్వాలని పిసిబి భావిస్తోందట.