తిరుపతి: తిరుపతి కలెక్టరేట్‌కు బాంబు బెదిరింపు మెయిల్ వచ్చింది. కలెక్టరేట్ భవనాన్ని బంుతలో పేల్చేస్తామండటూ గుర్తు తెలియని వ్యక్తులు మెయిల్‌లో పేర్కొన్నారు. దీంతో బాంబ్ స్క్వాడ్, డాగ్ స్వ్కాడ్ బృందం రంగంలోకి దిగాయి. కలెక్టరేట్‌లోని వివిధ విభాగాలు, పరిసర ప్రాంతాలను పరిశీలించారు. కలెక్టర్ ఛాంబర్‌తో పాటు కార్యాలయంలోని వివిధ శాఖలకు చెందిన గదులను పరిశఈీలించిన తర్వాత ఎలాంటి పేలుడు పదార్థాలు లేవని నిర్ధరించారు. తిరుపతి కలెక్టర్ కార్యాలయ అధికారిక మెయిల్‌కు తమిళనాడు నుంచి ఈ బెదిరింపు మెయిల్ వచ్చింది. గడిచిన 15 రోజుల్లో బాంబు బెదిపింపు మొయిల్స్ రావడం ఆందోళన కలిగిస్తోంది.