తన దేశ దురాక్రమణకు గురైన ఆసియా బాధితులకు 1995లో ‘మురాయమా ప్రకటన’ ద్వారా క్షమాపణలు చెప్పిన జపాన్ మాజీ ప్రధాని టోమిచి మురాయమా శుక్రవారం కన్నుమూశారు. ఆయన వయస్సు 101 సంవత్సరాలు. జపాన్ సోషల్ డెమోక్రటిక్ పార్టీ అధిపతి మిజుహో ఫుకుషిమా ప్రకటన ప్రకారం, మురాయమా తన స్వస్థలమైన నైరుతి జపాన్‌లోని ఓయిటాలోని ఓ ఆసుపత్రిలో మరణించారు. 1994 నుంచి 1996 వరకు సంకీర్ణ ప్రభుత్వానికి నాయకత్వం వహించిన మురాయమా రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్ చర్యలకు చారిత్రాత్మక క్షమాపణలు తెలిపారన్నది గమనార్హం.