అమరావతి: జలపాతంలో యువకుడు గల్లంతైన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు జిల్లా పలమనేరు రూరల్ మండలంలో జరిగింది. యూనిస్ అనే యువకుడు తన స్నేహితులతో కలిసి కళ్యాణరేవు జలపాతానికి వెళ్లాడు. యూనిస్ జలపాతంలో దూకి ఒడ్డుకు వస్తుండగా ఒక్కసారిగా మునిగిపోయాడు. సుడిగుండంలో చిక్కుకుని గల్లంతయ్యాడు. వెంటనే స్నేహితులు అగ్నిమాపక సిబ్బంది, పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని యువకుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. గజఈతగాళ్లతో సహాయంతో కూడా గాలింపు చర్యలు చేపట్టారు. జలపాతంలో దూకిన దృశ్యాలు స్నేహితులు సెల్ ఫోన్ లో వీడియో తీశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.