అమరావతి: ప్రధాని నరేంద్ర మోడీ శ్రీశైలం క్షేత్రాన్ని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు, అధికారులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. భ్రమరాంబ, మల్లికార్జున స్వామి వారికి ఆయన పూజలు చేశారు. ప్రధాని మోడీ వెంట సిఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సిఎం పవన్ కల్యాణ్‌లు ఉన్నారు. శ్రీశైలం పరిసరాల్లో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. సున్నిపెంట ప్రాంతంలో 1500 మంది సిబ్బంది పహారాగా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు పర్యటనకు పిఎం మోడీ వచ్చిన విషయం తెలిసిందే.